Monday 27 June 2011

నా ప్రేమ-4 (కొనసాగింపు )

తపన ఎక్కువాయె
కునుకు దూరమాయె
నడక సాగాకపోయే
ముద్ద మింగుడుపడలే
ఎన్నాళ్ళకో ఇక నీ దర్శనం
ఏనాటికో మనకిక పరవశం
ఎన్నటికి నీవే నా సర్వస్వం
ఎప్పటికి మల్లి మనం కలుసుకుంటాం ?
చదవాలని కోరుకున్నదోక్కటి 
తల్లితండ్రుల కోరిక మరొకటి 
నా బవిష్యత్తు కారు చీకటి 
నేనెలా దీన్ని తొలగించేది
 
ఒప్పించాను ఒక చదువు  
నిర్ణయించాను కళాశాల 
చేరాలి తొందరలో
ఉండాలి నాచెలి నుంచి దూరంగా
 
వచ్చాను నా చెలి చోటికి
వేచాను తన వోరకంటి చూపుకి
దొరికింది నాకు తన చూపు
మదిలో కలిగే పెద్ద ఊపు
 
చేరాను కళాశాలలో
నా చెలికి ఇప్పుడు ఎంతో దూరం లో
ఇచ్చను తనకి ఆవేదన
ఇది తనకి నరకయాతన
 
చదువు లో శ్రద్ధ లేదు
ఆటల లో లీనం కాలేదు
బికారిలా తిరుగుతున్న
పిచ్చోడినై తపిస్తున్నా
 
ఎలా ఉన్నదో నా చెలి
కావలి తన కౌగిలి
తన ప్రేమే నా ఊపిరి
ఏమి జరుగుతుందో తదుపరి
 
వచ్చాను నా ఊరికి
వెతికాను తన ఆచూకి
తపించాను తన ప్రేమకి
ఎదురయ్యింది నా చెలి
పంచుకున్నం ప్రేమని కను పాపలో తో
చిరునవ్వు చిన్ధించాం పెదవులతో
పెంచుకున్నాం ప్రేమని మనసులో
ధచుకున్నాము కన్నీటిని కనురెప్పలలో……………….కొనసాగుతుంది

No comments:

Post a Comment